విద్యార్థులకు రాష్ట్ర, జిల్లా ర్యాంకులు…

విద్యార్థులకు రాష్ట్ర, జిల్లా ర్యాంకులు…

చిట్యాల, ఆంధ్రప్రభ : Ekalavya సంస్థ నిర్వహించిన IIT & NEET రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్షలో నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ చిట్యాల మున్సిపాలిటీ లోని Saint Mary’s High School, Chityal విద్యార్థులు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ర్యాంకులు సాధించి పాఠశాలకు గౌరవం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవార్డులు, మెడల్స్‌ను హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠంలో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్త డా. జయప్రకాశ్ నారాయణ, E-Gurukul for IAS సంస్థ స్థాపకుడు ఆకెళ్ల రాఘవేంద్ర, అలాగే Ekalavya CEO దొంతినేని నర్సింహ చేతుల మీదుగా అందజేశారు.

ఈ ప్రతిభా పరీక్షలోరాష్ట్ర స్థాయి టాపర్‌గా• బైరు చైత్ర (8వ తరగతి) జిల్లా స్థాయి టాపర్లుగా• సిలివేరు శ్రీహిత (6వ తరగతి)• బొబ్బల భావన (7వ తరగతి)• దొమ్మాటి అమృత వర్షిణి (9వ తరగతి) విద్యార్థులు అవార్డులు, మెడల్స్‌ను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గట్టు అలెగ్జాండర్ రెడ్డి, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభపై పాఠశాల యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసి, భవిష్యత్తులో మరింత ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Leave a Reply