Wimbledon 2025 | గ్రాస్ కోర్టును జ‌యించిన పోలాండ్ టెన్నిస్ స్టార్ !

  • మహిళల సింగిల్స్‌లో చరిత్ర సృష్టించిన ఇగా స్వయటేక్

‘క్లే కోర్ట్ క్వీన్’గా పేరుగాంచిన స్వయటేక్, ఇప్పుడు గాస్ కోర్ట్‌ను కూడా జయించి చూపించింది. ఈరోజు (శనివారం) జరిగిన వింబుల్డన్ 2025 మహిళల సింగిల్స్ ఫైనల్లో అమెరికా ప్లేయర్ అమాండా అనిసిమోవాను (6-0, 6-0) వ‌రుస సెట్ ల‌లో చిత్తుగా ఓడించి తన తొలి వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

సెమీఫైనల్లో వరల్డ్ నంబర్ 1 అరినా సబలెంకాను సంచలనాత్మకంగా ఓడించిన అనిసిమోవా, తన మొదటి గ్రాండ్ స్లామ్ ఫైనల్లోనే పూర్తి పరాజయం చవిచూసింది. ఈ గెలుపుతో స్వయటేక్ తన ఆరో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

మొదటి గేమ్ నుంచే దూకుడు చూపించిన స్వయటేక్, కేవలం 26 నిమిషాల్లోనే తొలి సెట్‌ను 6-0తో గెలిచి ఒక్క బ్రేక్ పాయింట్ కూడా ఇవ్వలేదు. రెండో సెట్‌లో కూడా అనిసిమోవాకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా స్వయటేక్ తన మొదటి చాంపియన్‌షిప్ పాయింట్‌కే మ్యాచ్‌ను ముగించేసింది.

ఇక పురుషుల సింగిల్స్ ఫైన‌ల్స్ రేపు జ‌ర‌గ‌నుండ‌గా.. ఈ పోరులో జానిక్ సినర్ – కార్లోస్ ఆల్కరాజ్ త‌ల‌ప‌డ‌నున్నారు.

స్వయటేక్ సృష్టించిన రికార్డులు:

  • ఓపెన్ శకంలో వింబుల్డన్ గెలిచిన తొలి పోలిష్ క్రీడాకారిణి.
  • 8వ సీడ్‌గా గ్రాండ్‌స్లామ్ గెలిచిన మూడవ మహిళ (ఆష్లీ బార్టీ — 2019 రోలాండ్ గారోస్, పెట్రా క్విటోవా — 2011 వింబుల్డన్).
  • ఓపెన్ శకంలో ఆరు మహిళల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ ఫైనల్స్‌ను గెలుచుకున్న మూడవ క్రీడాకారిణి (మార్గరెట్ కోర్ట్, మోనికా సెలెస్ తర్వాత).
  • 2002లో సెరెనా విలియమ్స్ తర్వాత మూడు విభిన్న కోర్టులపై గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన అతి పిన్న వయస్కురాలు.

Leave a Reply