వైసీపీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు..

వైసీపీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు..
కోడూరు, ఆంధ్ర ప్రభ : కోడూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా సోమవారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తనయులు సింహాద్రి వికాస్ పాల్గొన్నారు. ముందుగా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి యాదవ రెడ్డి వెంకట సత్యనారాయణ, వైసీపీ మండల కన్వీనర్, పరిశె మాధవరావు, కోట పద్మావతి వరప్రసాద్, కొండవీటి వెంకటనారాయణ, బడే హేమ గంగాధర్, వెన్నా ప్రసాద్, మాలె నరేష్ కోట సుబ్రహ్మణ్యం, బండే నాగరాజు, పోతన పవన్ కళ్యాణ్, పోతుల నరేష్ తో పాటు పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.
