ఇఫ్తార్ విందులో శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి

ఇఫ్తార్ విందులో శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్ ప్రతినిధి, ఆంధ్ర ప్రభ : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నాగర్ కర్నూల్ పట్టణంలోని 24వ వార్డు కౌన్సిలర్ నిజాం ఆధ్వర్యంలో స్థానిక మదర్సాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్‌లో పాల్గొని వారికి రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేశారు.
రంజాన్ మాసం సౌహార్దం, సహనం, సేవాభావం వంటి గొప్ప విలువలను సమాజానికి తెలియజేసే పవిత్రమైన కాలమని పేర్కొన్నారు. సమాజంలో అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో, ఐక్యతతో కలిసి జీవించడం ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు,మునిసిపల్ వైస్ చైర్మన్ బాదం రమేష్, స్థానిక కౌన్సిలర్స్ ,ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
