18న ఇఫ్తార్ విందు ఏర్పాటు…

18న ఇఫ్తార్ విందు ఏర్పాటు…
హాజరు కానున్న మాజీ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి….
కృష్ణలంక విజయవాడ తూర్పు, ఆంధ్ర ప్రభ : రాష్ట్ర వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరుపున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ముస్లిం పెద్దలు పాల్గొంటారు. విజయవాడ లబ్బిపేట ఎస్ ఎస్ కన్వేషన్ హాల్ నందు ఇఫ్తార్ విందు కార్యక్రమం ఇఫ్తార్ విందు కి ముస్లింలు అందరూ తరలిరావాలని ఎన్టీఆర్ జిల్లా వైసిపి అధ్యక్షులు, దేవినేని అవినాష్ ముస్లిం సోదరులను కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇఫ్తార్ విందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసిపి మైనార్టీ సోదరులు ,పెద్దలు పాల్గొంటారు. మైనార్టీ సోదరులంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఆయన కోరారు. మాజీ ఎమ్మెల్యే, వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నాం.ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా వైసిపి పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అన్నారు. మైనార్టీలకు మేలు చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి ఆయన అన్నారు.
మాజీ ఎమ్మెల్యే,మల్లాది విష్ణు మాట్లాడుతూ… అధికారంలో ఉన్నా లేకపోయినా మైనార్టీ సోదరులకు వైసిపి ఆధ్వర్యంలో ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మైనార్టీ సోదరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. వైఎస్సార్, వైఎస్ జగన్ మైనార్టీలకు అండగా నిలిచిన వ్యక్తులు వైఎస్సార్ మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కల్పించారు.
ఎమ్మెల్సీ, రుహుల్లా మాట్లాడుతూ… వైఎస్సార్ 4% శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్లే ఎంతోమంది డాక్టర్లు,ఇంజనీర్లు అయ్యారు ఆయన గుర్తు చేశారు. మైనార్టీల నుంచి నలుగురికి ఎమ్మెల్సీ ఇచ్చారు. మైనార్టీ వ్యక్తిని డిప్యూటీ సీఎం చేశారనీ కొనియాడారు. 18వ తేదీన ముస్లిం సోదరులతో కలిసి జగన్ మోహన్ రెడ్డి ఇఫ్తార్ లో పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, ముస్లిం పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
