పంట చేతికి వచ్చింది అనుకుంటే..

పంట చేతికి వచ్చింది అనుకుంటే..
ఆంధ్రప్రభ ప్రతినిధి జనగామ : కష్టపడి అప్పులు చేసి వ్యవసాయం చేస్తే.. వరి పంట చేతికి వచ్చేసరికి బుధవారం ఎడతెరిపిలేని తుఫాన్ తో నాలుగు ఎకరాల వరి పంట పొలంలో వరద నీరు నిలిచిపోయింది. దీంతో కోయలేక మునిగిపోయే పరిస్థితి వచ్చింది. పంట పొలంలోకి వరి కోత మిషన్ పోవాలన్నా రోడ్డు గండిపడి బావి దగ్గరకు కూడా వెళ్లలేని పరిస్థితి దాపురించిందని వడ్లకొండ (Vadlakonda) గ్రామానికి చెందిన మడి కంటి ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదేవిధంగా నిన్నటి తుఫాన్ ప్రభావంతో జనగామ నుండి హుస్నాబాద్ వెళ్లే రహదారి గానుగు పహాడ్ స్టేజ్ వద్ద రోడ్డుకు పెద్ద గండి పడంది. దీంతో నీటి ప్రవాహం ఉధృతంగా వెళ్లడం వల్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గతంలో కురిసిన వర్షానికి రోడ్డు గండి పడ్డ స్థానిక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు, అధికారులు కానీ పట్టించుకోలేని పరిస్థితి నెలకొందని.. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణ మరమ్మత్తులు చేపట్టాలి. వాహనదారులకు, ప్రజలకు, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన కోరారు.
