అభివృద్ధి కొనసాగాలంటే… కాంగ్రెస్ కు ఓటు వేయండి

అభివృద్ధి కొనసాగాలంటే… కాంగ్రెస్ కు ఓటు వేయండి

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న‌ప్పుడే ప్ర‌జ‌ల‌కు ఏం చేయ‌లేదు
జూబ్లీహిల్స్ లో గెలిచి ఏం సాధిస్తారు
బీఆర్ఎస్ ను న‌మ్మి మోస‌పోవ‌ద్దు
కేసీఆర్ పాల‌న‌లో రికార్డు స్థాయిలో అప్పులు
ర‌హ‌మ‌త్ న‌గ‌ర్ ఇంటింటి ప్ర‌చారంలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు


రహమాత్ నగర్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా రహమత్ నగర్ డివిజన్ లో ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడపగడప కు తిరుగుతూ మ‌హిళ‌ల‌ను, వృద్దుల‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ.. యోగాక్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు.

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. గ‌తంలో బీఆర్ఎస్ ఓటు వేస్తే చేసింది శూన్య‌మ‌ని, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశార‌ని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న‌ప్పుడే ప్ర‌జ‌ల‌కు ఏం చేయ‌లేదని, ఇప్పుడు ఏం చేస్తార‌ని, వారికి ఓటు వేస్తే వృధా అవుతుంద‌ని వెల్ల‌డించారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్ కు ఓటు వేసి గెలిపించాల‌ని అభ్య‌ర్థించారు.

Leave a Reply