idols |12 జ్యోతిర్లింగాల విగ్రహ ప్రతిష్టాపనను జయప్రదం చేయండి..

idols |12 జ్యోతిర్లింగాల విగ్రహ ప్రతిష్టాపనను జయప్రదం చేయండి..

రేపు తిప్రాస్ పల్లిలో విగ్రహాల ప్రతిష్టాపన

idols | ఊట్కూర్,ఆంధ్రప్రభః భక్తుల్లో ఆధ్యాత్మికత పెంచేందుకు 12 జ్యోతిర్లింగాల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం జయప్రదం చేయాలని తిప్రాసు పల్లి సర్పంచు విజయలక్ష్మి నరసింహ కోరారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని తిప్రాస్ పల్లి గ్రామంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మల్లికార్జున స్వామి దేవాలయంలో గురు స్వామి కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో, కందూరు ప్రధాన చార్యులు మణికంఠ శివ ఆచార్య చేతుల మీదుగా విగ్రహాలు ప్రతిష్టాపన చేస్తున్నట్లు తెలిపారు.

మల్లికార్జున స్వామి దేవాలయంలో గణపతి పూజ వేద స్వస్తి అంకురార్పణ చేపట్టగా, ఈనెల 19న గురువారం వాస్తు పూజ హోమాలు, ఈనెల 20న శుక్రవారం బింబస్థాపన, ప్రతిష్టాపన మహా కుంభాభిషేకం చేపడుతూ రామలక్ష్మణ, సీత, ఆంజనేయ, శ్రీలక్ష్మి, దత్తాత్రేయ, అయ్యప్ప, నంది, ధ్యాన శివుడు, బ్రమరాంబిక, గణపతి కార్తికేయులు నాగదేవతల విగ్రహ ప్రతిష్టాపన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలో చేపట్టే విగ్రహాల ప్రతిష్టాపనకు చిలుకూరి బాలాజీ శివాలయ ప్రధాన అర్చకులు శ్రీ రామదాసు సురేష్ ఆత్మారాం మహారాజ్, తిరుమల తిరుపతి దేవస్థాన శైవాగపండితులు తాళ్లపాక మణికంఠ శివాచార్య తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు.

విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విగ్రహ ప్రతిష్టాపనకు ప్రజలు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply