Icon Star | లోకేష్ కనగరాజ్ మూవీ ఎప్పుడు..?

Icon Star | లోకేష్ కనగరాజ్ మూవీ ఎప్పుడు..?
అట్లీ తర్వాత లోకేష్‌తో బన్నీ.. హాట్ టాపిక్‌గా మారిన కాంబో
అనౌన్స్ మెంట్ వీడియో సెన్సేషన్.. అనిరుథ్ బీజీఎం ట్రెండ్
షూటింగ్ స్టార్ట్ కాకుండానే హిట్ అన్న కామెంట్స్
బన్నీ – లోకేష్ సెల్ఫీ వైరల్.. మళ్లీ వార్తల్లో సినిమా
సెట్స్ పైకి ఎప్పుడు? సమ్మర్ తర్వాత స్టార్ట్ చేసే ప్లాన్
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో భారీ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాకుండానే.. మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో బన్నీ మూవీని అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. ఈ క్రేజీ కాంబో మూవీ ఇంకా సెట్స్ పైకి రాకుండానే.. హిట్ అనేంతగా టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు మరోసారి ఈ సినిమా గురించి న్యూస్ వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగింది..? ఈ భారీ, క్రేజీ మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?
Icon Star | అనౌన్స్ మెంట్ వీడియో సెన్సేషన్..

అల్లు అర్జున్.. అట్లీతో మూవీ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. ఇక లోకేష్ కనకరాజ్ కూలీ తర్వాత ఖైదీ 2 చేస్తాడని.. అమీర్ ఖాన్ తో మూవీ చేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే.. అనూహ్యంగా అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్.. కలిసి సినిమా చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసి సర్ ఫ్రైజ్ ఇచ్చారని చెప్పచ్చు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోకు మంచి స్పందన రావడంతో.. కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సినీ అభిమానులు దీని గురించి మాట్లాడుకునేలా చేసింది.
Icon Star | షూటింగ్ స్టార్ట్ కాకుండానే హిట్..

ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ఈ మ్యూజిక్ తో మిలియన్ కి పైగా రీల్స్ చేయడం.. అలాగే లక్షలాది మంది రింగ్ టోన్గా ఈ మ్యూజిక్ ను డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఈ మ్యూజిక్ తెగ ట్రెండ్ అవ్వడంతో ఈ సినిమా ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయకుండానే హిట్ అయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. అయితే.. బన్నీ, లోకేష్ తీసుకున్న సెల్ఫీ బయటకు వచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మరోసారి ఈ కాంబో మూవీ వార్తల్లో నిలిచింది. మరి.. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే.. ఈ సమ్మర్ కి అట్లీతో చేస్తున్న మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆతర్వాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువస్తారని.. సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

