Acb Raids : ఇచ్ఛాపురం లో ఎసిబి కలకలం Andhra Prabha News

Acb Raids : ఇచ్ఛాపురం లో ఎసిబి కలకలం Andhra Prabha News
రూ.10 వేలు లంచంతో దొరికిన ఎంఇఓ
విశ్రాంత ఉపాధ్యాయుడి ఫిర్యాదు తో వల
డీఎస్పీ సత్యనారాయణ నేతృత్వంలో ఆపరేషన్
( ఆంధ్రప్రభ, ఇచ్ఛాపురం)
, ఇచ్ఛాపురం లో ఏసిబి దాడి కలకలం రేపింది. రూ. 10 వేలు లంచం తీసుకుంటూ మండల విద్యాశాఖాధికారి కూరమాన అప్పారావు ఎసిబి అధికారుల కు చిక్కారు. డీఎస్పీ సత్యనారాయణ, సిఐ లు భాస్కర రావు, రమణ లు వలపన్ని పట్టుకున్నారు. కార్యాలయంలోని ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ తో సాహా ఎంఇఓ ను అదుపులోకి తీసుకున్నారు. పదవీ విరమణ పొందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు తన పదవీ విరమణ ప్రయోజనాల కోసం రూ.10 వేలు లంచం డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు.
