క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడానికి చిన్న జట్ల కృషిని గుర్తించిన ఐసీసీ (International Cricket Council) డెవలప్‌మెంట్ అవార్డ్స్-2024ను (Development Awards-2024) ప్రకటించింది. మొత్తం ఎనిమిది దేశాల క్రికెట్ బోర్డులకు ఈ అవార్డులను అందజేశారు. సింగపూర్ (Singapore)లో జరిగిన ఈ కార్యక్రమంలో ఐసీసీ ఛీఫ్ జై షా (Jay Shah) ఈ అవార్డులను అందించారు.
ఈ అవార్డులు అందుకున్న ఎనిమిది దేశాల క్రికెట్ బోర్డులు:
- నేపాల్
- భుటాన్
- యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA)
- ఇండోనేషియా
- నమీబియా
- స్కాట్లాండ్
- టాంజానియా
- వనౌతు
వివిధ అవార్డులు :
- ఐసీసీ అసోసియేట్ మెంబర్ మెన్స్ టీమ్ పెర్ఫార్మెన్స్ అవార్డు: గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో సంచలనాత్మక ప్రదర్శనతో సూపర్-8కు దూసుకెళ్లిన అమెరికా జట్టు బోర్డు ఈ అవార్డును అందుకుంది.
- ఐసీసీ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు: క్రికెట్ నమీబియాకు ఈ అవార్డు లభించింది.
- ఉమెన్ క్రికెట్ ఇనిషియేటివ్ అవార్డు: క్రికెట్ చరిత్రలో తొలిసారిగా భుటాన్ క్రికెట్ మండలి, వనౌటు క్రికెట్ సంఘం ఈ అవార్డుకు ఎంపికయ్యాయి.
- ఐసీసీ డిజిటల్ ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు: నేపాల్ క్రికెట్ సంఘానికి ఈ అవార్డు దక్కింది.
ఈ అవార్డులు చిన్న దేశాల క్రికెట్ బోర్డులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయని, క్రికెట్ అభివృద్ధికి ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.