టీమిండియా సీనియర్ ప్లేయర్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ విడుదల చేసిన తాజా (మే 14) ర్యాంకింగ్స్‌లో జడేజా తన స్థానాన్ని నిలుపుకున్నాడు. దీంతో, ఐసీసీ టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్న ఆటగాడిగా జడేజా చరిత్ర సృష్టించాడు.
2022 మార్చి 9న రవీంద్ర జడేజా వెస్టిండీస్ ఆటగాడు జాసన్ హోల్డర్‌ను అధిగమించి నంబర్ వన్ టెస్ట్ ఆల్ రౌండర్‌గా నిలిచాడు. అప్పటి నుండి, జడేజా నేటి వరకు దాదాపు 38 నెలలు (1152 రోజులు) నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.
తాజా ఐసీసీ టెస్ట్ టాప్-5 ఆల్‌రౌండర్లు..
- రవీంద్ర జడేజా (భారత్) – 400 రేటింగ్ పాయింట్లు
- మెహదీ హసన్ మిరాజ్ (బంగ్లాదేశ్) – 327 రేటింగ్ పాయింట్లు
- మార్కో జాన్సెన్ (దక్షిణాఫ్రికా) – 294 రేటింగ్ పాయింట్లు
- పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – 271 రేటింగ్ పాయింట్లు
- షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) – 253 రేటింగ్ పాయింట్లు