ICC Rating | ఐసిసి ర్యాంకింగ్ లో “కింగ్” కోహ్లినే !!

క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మరో సెన్సేషనల్ మైలురాయి సాధించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో టెస్ట్స్, ఓడీఐస్, టీ20 ఇలా ఈ మూడు ఫార్మాట్లలోనూ 900 పైగా రేటింగ్ పాయింట్లు దాటిన ఏకైక బ్యాటర్‌గా హిస్టరీ క్రియేట్ చేశాడు.

ఐసిసి (ICC – International Cricket Council) తాజా అప్‌డేట్‌లో, టీ20I లలో కోహ్లీ మునుపటి అత్యుత్తమ స్కోరు 897 నుండి 909 పాయింట్లకు అప్‌గ్రేడ్ అయ్యింది. దీంతో కోహ్లీ ఈ అరుదైన రికార్డును సాధించాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా రికార్డులను క్రియేట్ చేస్తూ.. కోహ్లీ మరోసారి తన గొప్పతనాన్ని నిరూపించుకున్నాడు.

అన్నీ ఫార్మాట్ల‌లో డామినేషన్

ఇప్పటికే టెస్టులు, వన్డేల్లో 900 మార్కును దాటిన కోహ్లీ, ఇప్పుడు టీ20ల్లో 900 కంటే ఎక్కువ రేటింగ్ సాధించి.. క్రికెట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పాడు.

  • టెస్ట్స్: 937 పాయింట్లు
  • ఓడీఐస్: 909 పాయింట్లు
  • టీ20: 909 పాయింట్లు

ఒకటి కాదు, మూడు వేర్వేరు ఫార్మాట్లలో 900 కంటే ఎక్కువ రేటింగ్ సాధించి విరాట్ కోహ్లీ మరోసారి క్రికెట్ పై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు.

Leave a Reply