అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) జూన్ 11న విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో కూడా అద్భుతంగా రాణిస్తోంది. వన్డే, టీ20 ఫార్మాట్లలో భారత్ అగ్రస్థానాన్ని ఆక్రమించగా, టెస్ట్ విభాగంలో ఆస్ట్రేలియా అగ్రగామిగా నిలిచింది.
ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్…
వన్డేల్లో భారత్ 124 రేటింగ్‌తో మొదటి స్థానంలో, న్యూజిలాండ్ 109తో రెండో స్థానం.
టీ20ల్లో భారత్ 271 రేటింగ్‌తో అగ్రస్థానంలో, ఆస్ట్రేలియా 262తో రెండో స్థానంలో.
టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియా 126తో టాప్, ఇంగ్లాండ్ 113తో రెండో స్థానం. సౌతాఫ్రికా (111), భారత్ (105) మూడో, నాలుగో స్థానాల్లో నిలిచాయి.
టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో గట్టి పోటీ:
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ 856 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. భారత్ తరఫున యువ సంచలనం అభిషేక్ శర్మ 829 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మరో యువ బ్యాటర్ తిలక్ వర్మ 804 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకాడు.
ఇంగ్లాండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ ఆటకు దూరంగా ఉండటంతో అతని ర్యాంకు నాలుగో స్థానానికి పడిపోయింది. భారత స్టార్ సూర్యకుమార్ యాదవ్ ఒక స్థానం దిగజారి ఆరో స్థానానికి వెనుకబడగా, అతని స్థానాన్ని జోస్ బట్లర్ (ఇంగ్లాండ్ కెప్టెన్) ఐదో స్థానంగా ఆక్రమించాడు.
బౌలింగ్, ఆల్‌రౌండర్లలో భారత ప్రభావం..
టీ20 బౌలింగ్ విభాగంలో న్యూజిలాండ్ బౌలర్ జేకబ్ డఫీ అగ్రస్థానంలో ఉండగా, భారత్ తరఫున వరుణ్ చక్రవర్తి మూడో స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా 252 పాయింట్లతో నెం.1 స్థానంలో ఉన్నాడు.
టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా, జడేజా మెరుపు:
టెస్ట్ బ్యాటింగ్‌లో జో రూట్ (ఇంగ్లాండ్) 888 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. భారత యువ బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్ నాలుగో స్థానంలో ఉన్నాడు.
టెస్ట్ బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా 908 రేటింగ్‌తో నెం.1 స్థానాన్ని ఆక్రమించాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
వన్డే ఫార్మాట్‌లో గిల్ అగ్రస్థానంలో..
వన్డే బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ 784 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అతని తర్వాత బాబర్ అజామ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. 7వ స్థానంలో శ్రేయస్ అయ్యార్ కొనసాగుతున్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ రెండవ స్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా టాప్ 10లో ఉన్నాడు.