ICC Champions Trophy | షమీకి మరో వికెట్… బంగ్లా స్కోర్.. 26/3
దుబాయ్ ఛాంపియన్స్ ట్రోపీలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో షమీ మరో వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఓపెనర్ సౌమ్య సర్కార్ ను పెవిలియన్ కు చేర్చిన షమీ బంగ్లా బ్యాటర్ మిరాజ్ ను ఔట్ చేశాడు. మిరాజ్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఏడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. హర్షిత్ రాణాకు కూడా ఇప్పటి వరకు ఒక వికెట్ దక్కింది.