ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో భారత దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల స్థానాలు కాసేపు అదృశ్య మయ్యాయి. గత వారంలో ప్రకటించిన ర్యాంకింగ్స్ లో రోహిత్, కోహ్లి స్థానాలు ఉన్నాయి. రోహిత్ 756 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా.. కోహ్లి 736 రేటింగ్ పాయింట్లతో 4వ స్థానంలో నిలిచాడు. తాజా ర్యాంకింగ్స్ మాత్రం రెండో స్థానంలో పాక్ బ్యాటర్ బాబర్ ఆజామ్, 4వ స్థానంలో చరిత్ అసలంకను చూపించింది. అసలు రోహిత్, కోహ్లి పేర్లే లేకపోవడం అభిమానులను ఆశ్చర్యాన్ని కలిగించింది.
తప్పు గుర్తించిన ఐసీసీ దీనిపై స్పందించింది. సాంకేతిక లోపం వల్ల అలా జరిగిందని క్లారిటీ ఇచ్చింది. మళ్లీ ర్యాంకింగ్స్ ను సరిచే సింది. ప్రస్తుతం స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రోహిత్ 2వ స్థానంలోనే ఉన్నాడు. కోహ్లి కూడా 4వ స్థానాన్ని కాపాడుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ 6వ స్థానంలో ఉండగా.. టాప్ -10లో నలుగురు భారత బ్యాటర్లు ఉండటం విశేషం.
నం. 1 బౌలర్ మహరాజ్
సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ వన్డేల్లో నం.1 బౌలర్గా అవతరించాడు. తాజా ర్యాంకింగ్స్ లో 687 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకున్నాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో మహరాజ్ ఐదు వికెట్లతో చెలరేగి సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రదర్శనే కార ణంగానే అతను రెండు స్థానాలు ఎగబాకి టాప్ ర్యాంక్ పొందాడు. గత ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో ఉన్న శ్రీలంక బౌలర్ మహేశ్ తీక్షణ రెండో స్థానానికి పడిపోయాడు.
భారత స్పిన్నర్ కుల్దీప యాదవ్ 3వ స్థానంలో ఉన్నాడు. షమీ, బుమ్రా, సిరాజ్ చెరో స్థానం మెరుగుపర్చుకుని వరుసగా 13, 14, 15 ర్యాంక్లలో నిలిచారు. వెస్టిండీస్ బౌలర్ జేడెన్ సీల్స్ ఏకంగా 17 స్థానాలు ఎగబాకి 18వ ర్యాంకు చేరుకున్నాడు. ఆల్ రౌండర్ జడేజా ఒక్క స్థానంని మెరుగు పరుడచుకుని టాప్ -10లో నిలిచాడు.