Ibrahimpatnam | మాజీ సర్పంచ్ మృతి..

Ibrahimpatnam | మాజీ సర్పంచ్ మృతి..
Ibrahimpatnam | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పై (Road) కాచవరం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో మాజీ సర్పంచ్ దుర్మరణం చెందాడు. సేకరించిన సమాచారం ప్రకారం.. కాచవరం మాజీ సర్పంచ్ ఎం.వెంకటరత్నం (55) కాచవరం సెంటర్ లో వ్యక్తిగత పని చూసుకుని ద్విచక్ర వాహనం పై తిరిగి ఇంటికి వెళ్తున్నారు. అయితే.. విజయవాడ వైపు కంకరలోడుతో వెళ్తున్న టిప్పర్ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో మాజీ సర్పంచ్ వెంకటరత్నం అక్కడికక్కడే మరణించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
