ఐబీపీఎస్ (IBPS) 10,277 క్లర్క్ పోస్టులకు (clerk posts) దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత (Degree Eligibility)గల అభ్యర్థులు ఆగస్టు 21 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల్లో తెలంగాణలో 261 పోస్టులు ఉండగా.. ఏపీలో 367 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయసు ఆగస్టు 1, 2025 నాటికి 20 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ (Reservation) గల అభ్యర్థులకు వయోపరిమితి (Age limit)లో సడలింపు కలదు.
దరఖాస్తు ఫీజు (Application fee) రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లించాలి. అభ్యర్థులను రాత పరీక్షద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ (Preliminary Exam), మెయిన్ ఎగ్జామ్ (Main Exam). ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
మెయిన్స్ లో మెరిట్ సాధించిన వారికి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (Language Proficiency Test) నిర్వహిస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification) ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రాథమిక పరీక్ష అక్టోబర్ 2025లో, మెయిన్స్ నవంబర్ 2025లో నిర్వహిస్తారు.