ప్రజల అవకాశం ఇస్తే 24 గంటలు సేవ చేస్తా

తిర్యాని, ఆంధ్రప్రభ : నాయకపూగూడ గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం ఈనెల 17న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని నాయకపూగూడా సర్పంచ్ అభ్యర్థి ఎదుల దేవకి ఇంటింటి ప్ర‌చారం చేశారు.

గ్రామంలోని నెలకొన్న అన్ని సమస్యలను సర్పంచ్ బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలల్లోనే తెలుసుకుని, ఎప్పటికప్పుడు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు సమస్యలకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.

అదనంగా, ప్రజలకు అన్ని సమయాల్లో 24 గంటలు అందుబాటులో ఉంటానని, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆమె వెంట వార్డు మెంబర్లు, పిఎస్ఎస్ వైస్ చైర్మన్, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply