Hydraa | జూబ్లీ చెప్పింది.. హైడ్రా కావాలని !

  • హైడ్రా చర్యలకు జనావెూదం
  • గ్రేటర్‌వాసుల ఆలోచనా సరళిలో మార్పు
  • జూబ్లీహిల్స్‌ పోరులో ఆధిక్యతే ఇందుకు నిదర్శనమా
  • గులాబీ నేతల విమర్శలకు చెక పెట్టిన ప్రజలు
  • భావితరం భవిష్యత్‌ కోసం నగర ప్రజల ఓట్లు
  • కాంగ్రెస్‌ విజయంపై సామాజికవేత్తల మనోభావం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ పొలిటికల్‌ బ్యూరో : నువ్వానేనా అన్నట్లు గా సాగిన జూబ్లిహిల్స్‌ (Jubilee Hills) ఉపపోరులో.. ఇక్కడి ప్రజలు హైడ్రాకు (hydra) జై కొట్టారని సామాజికవేత్తలు అంచనావెస్తున్నారు. జూబ్లిహిల్స్‌ నియోజకవర్గ (Jubilee Hills Constituency) ఉపఎన్నికలో ప్రత్యర్థుల ఆరోపణలు, విమర్శలను ఏమాత్రం చెవికెక్కించుకోకుండా అధికార కాంగ్రెస్‌ పార్టీకి (Congress Party) ఈ ప్రాంత ప్రజలు అభయహస్తమిచ్చి, ఆ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ను (Naveen Yadav) విజయతీరాలకు చేర్చారని వారు పేర్కొంటున్నారు.

ఎన్నికల్లో ప్రత్యర్థులకు ప్రధానాస్త్రంగా మారిన హైడ్రాను (Hydra) గురించి అనేక రోడ్‌ షోలు, ఇంటింటి ప్రచారం సహా పలు ప్రెస్‌ మీట్లలోనూ గులాబీ పార్టీనేతలు విమర్శలు గుప్పించారని, అయితే మారిన ప్రజల ఆలోచనా సరళికి తోడు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆయా ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టారని, దీంతో ప్రజల్లో హైడ్రా (Hydra) పట్ల సానుకూల వాతావరణం కనిపిస్తోందని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

హైడ్రా ఆధ్వర్యంలో జరిగిన మంచి, తొలగిన సమస్యలపై ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి, ర్యాలీలు నిర్వహించడం, హైడ్రా పనితీరు కారణంగా తమ ప్రాంతాల్లో మురుగునీటి ముంపు నుంచి బయటపడ్డామని ముంపు కాలనీల ప్రజలు చేసిన ప్రచారం కూడా ఈ ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపిందని వారు పేర్కొంటున్నారు.

ప్రకృతి విపత్తులతో ఎదురవు తున్న అవస్థ లను తొలగించి, హైదరాబాద్‌ మహా నగరానికి ఉపశమనం కలిగించడం, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా చేస్తున్న కృషిని బీఆర్‌ఎస్‌ నేతలు గుర్తించక పోవడంపై సామాజిక వేత్తలు పెదవి విరుస్తున్నారు. జూబ్లిహిల్స్‌ ఉప ఎన్నికల్లో ఇళ్ల కూల్చివేతల వ్యవహారం అత్యంత ప్రభావం చూపుతుందని భావించిన గులాబీ నేతలు హైడ్రాపై విమర్శల వర్షం కురిపించారని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు.

హైడ్రా బుల్డోజర్లు కావాలా, అభివృద్ధి కోసం కారులో పోతారా తేల్చుకోవాలంటూ జూబ్లి ప్రజలకు ఆ పార్టీ నేతలు సూచించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు వచ్చిన వరదల నేపథ్యంలో అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌, నాలాలపై ఆక్రమణలను నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తామంటూ చేసిన హెచ్చరికలను కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని కల ప్రచారంలో ఉపయోగించి, వారు ఆనాడు రాజకీయ లబ్ధికోసం మాటలు చెప్పారని, తాము చేసి చూపిస్తున్నామని రేవంత్‌ ప్రజలకు వివరించడం కూడా కలిసి వచ్చిందన్న అభిప్రాయం వారి నుంచి వినిపిస్తోంది.

అతి, భారీ వర్షాల నేప థ్యంలో హైడ్రా బృందాలు తీసుకున్న ముందస్తు చర్యలు, పూ డికతీత వంటి పనులతో పాటు, నాలాకు వరద నీటి కనెక్టివిటీ కలిగించడం వంటి పనులను చేపట్టడం కూడా ప్రజలను ముంపు బారి నుంచి కాపాడిందన్న చర్చ జరుగుతోంది.

చెరువుల పునరుద్ధరణ…

ఏవీ.రంగనాథ్‌ నేతృత్వంలోని హైడ్రా బృం దాలు తొలినాళ్లలో చేపట్టిన కూల్చివేతలు అంద రిలోనూ కలకలం రేపాయని, అయితే రాను రానూ ఆ అభిప్రాయం తొలగి పోతున్నట్లు స్పష్ట మవుతుందని సామాజిక వేత్తలు పేర్కొంటున్నారు. ఆక్రమణలను నిలువరించడంతో పాటు, గత ఆక్రమణలపై ఉక్కుపాదం మోపడాన్ని ప్రజలు హర్షిస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు.

చెరువులను కబ్జాల బారి నుంచి కాపాడటంతో పనై పోయిందని పించుకోకుండా, చెరువుల పు నరుద్ధరణకు శ్రీకారం చుట్టి సక్సెస్‌ కావడం కూడా ప్రజల ఆలోచనల్లో మార్పునకు కారణమని వారు విశ్లేషిస్తున్నారు. పలు చెరువులను పునరుద్ధరించడం, పార్కులను కబ్జాల బారి నుంచి కాపాడి పెన్సింగ్‌ సైతం వేయడాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

గత ఏడాదిన్నర కాలంలో దాదాపు రూ.60వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను హైడ్రా పరిరక్షించడంతోనే జనామోదం లభించినట్లు వారు గుర్తు చేస్తున్నారు. దీంతో జూబ్లి ప్రజలు హైడ్రా పనితీరుకు ఫిదా అయ్యారని వారు అభిప్రాయపడుతున్నారు. సరిగ్గా ఏర్పాటైన 15నెలల వ్యవ ధిలోనే దాదాపు వెయ్యి ఎకరాల భూమిని పరిరక్షించడం ద్వారా హైడ్రా ప్రజల మనసులను గెలుచుకున్నట్లు సామా జికవేత్తలు అంచనా వేస్తున్నారు.

దాదాపు వెయ్యి ఎకరాల ప్ర భుత్వ, ప్రభుత్వేతర ఆస్తులను పరిరక్షించడం ద్వారా హైడ్రా తెలంగాణ ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చిందని కాంగ్రెస్‌ నేతలు సైతం గుర్తుచేస్తున్నారు. ఆదిలో కొంత ఇబ్బందికర పరి స్థి తులు ఎదురైనప్పటికీ, ప్రజల ఆలోచనలో వచ్చిన మార్పు జూబ్లిహిల్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయానికి కారణమని వారు సంబరంగా పేర్కొంటున్నారు.

Leave a Reply