ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మాదాపూర్‌లో హైడ్రా (Hydra at Madapur) హడలెత్తిస్తోంది. అక్రమ నిర్మాణాల(illegal constructions)పై ఉక్కుపాదం మోపుతోంది. ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులపై యాక్షన్ మొదలు పెట్టింది. మాదాపూర్‌లోని జూబ్లీ ఎన్‌క్లేవ్ (Jubilee Enclave)లోని ఆక్రమణలపై స్థానిక ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
స్థానికుల ఫిర్యాదుతో..
మాదాపూర్‌లో జైహింద్‌రెడ్డి అనే వ్యక్తి పార్కులు, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశాడని తెలపడంతో హైడ్రా రంగంలోకి దిగింది. లే అవుల్‌లో ఉన్న నాలుగు పార్కుల్లో రెండు పార్కులతో పాటు ఐదు వేల గజాల రహదారి, 300 గజాల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైనట్లు హైడ్రా గుర్తించింది. ఈ క్రమంలో గురువారం ఉదయమే హైడ్రా అధికారులు అక్కడికి చేరుకొని దాదాపు 16వేల గజాల స్థలాన్ని హైడ్రా రక్షించింది. దీని విలువ దాదాపు 400 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. కబ్జాదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.