సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ప్యాట్ని నాలా వెంట నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. కంటోన్మెంట్ పరిధిలో తొలిసారి హైడ్రా కూల్చివేతలు చేస్తోంది. గురువారం కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్‌తో కలిసి క్షేత్ర స్థాయిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు.
పలు నిర్మాణాలతో ప్యాట్ని నాళా కుచించుకుపోయినట్లు గుర్తించారు. ఈ కారణంగా భారీ వర్షాలు కురిస్తే.. కంటోన్మెంట్ ముంపు భారిన పడుతుందని భావించి ఈ మేరకు కూల్చివేతలు చేపట్టారు. కంటోన్మెంట్ అధికారుల సహకారంతో ప్యాట్ని నాళా వెంట నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు.