హైదరాబాద్ – నగరంలోని ఓ రెస్టారెంట్‌లో గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ దందాను బయటపెట్టింది ఈగల్ టీం.కూకట్‌పల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా సాగుతున్నట్టు గుర్తించింది. రెస్టారెంట్ యజమాని సూర్య నగరంలోని ప్రముఖ పబ్‌లతో కలిసి పార్టీలు నిర్వహిస్తున్నట్టు గుర్తించింది. సూర్య స్నేహితుల ద్వారా ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసన్న డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు.
భీమవరంకు చెందిన ప్రసన్న 20 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. అంతే కాకుండా నగరంలోని 23 మంది వ్యాపారవేత్తలకు సూర్య డ్రగ్స్ సరఫరా చేసినట్టు గుర్తించారు. నగరంలోని ప్రిజమ్ పబ్, ఫామ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్, బ్రాడ్ వే పబ్, వాక్ కోరా పబ్ లకు సైతం డ్రగ్స్ సప్లై చేసినట్టు తేలింది. సూర్య, హర్షలను ఈగల్ టీం అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad | మరో డ్రగ్స్ గుట్టు రట్టు – ఇద్దరు అరెస్ట్
