
Hyderabad | కారు సర్వీస్ సెంటర్‌లో చెలరేగిన మంటలు
Hyderabad | కారు సర్వీస్ సెంటర్‌లో చెలరేగిన మంటలు
Hyderabad | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఉప్పర్ పల్లి వద్ద మారుతి కారు సర్వీస్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. ఎగసి పడుతున్న మంటలను చూసి భయంతో పక్కనే ఉంటున్న అపార్ట్ మెంట్ వాసులు బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. క్షణాల్లో మంటలు భారీగా వ్యాపించడంతో సర్వీస్‌కు ఇచ్చిన పలు కార్లు కాలి బూడిదయ్యాయి. సర్వీస్ సెంటర్ లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. షాక్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరగినట్లుగా ప్రాథమిక సమాచారం.
