హైదరాబాద్: నగరంలో ఈ సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బంజారాహిల్స్, పంజాగుట్ట, జూబ్లి హిల్స్, యూసుఫ్ గూడ, మాదాపూర్, అమీర్‌పేట చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.
ఉదయం వరకు ఎండలు కనిపించినా, మధ్యాహ్నానికి తర్వాత మేఘాలు కమ్ముకుని, సాయంత్రానికి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వాతావరణ శాఖ సూచనల ప్రకారం, మరో రెండు నుండి మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వేడి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించినప్పటికీ, వర్షాలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని అధికారులు తెలిపారు.