Solution | వ్యవసాయ మార్కెట్ సమస్యలకు పరిష్కారం చూపండి..

Solution | వ్యవసాయ మార్కెట్ సమస్యలకు పరిష్కారం చూపండి..

  • మంత్రి తుమ్మలతో వ్యవసాయ మార్కెట్ క‌మిటీ చైర్మెన్ల భేటీ…

Solution | కంటోన్మెంట్, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో కొనసాగుతున్న సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధికి కావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర మార్కెట్ కమిటీ చైర్మన్‌ల ఫోరం ప్రతినిధులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సోమవారం సచివాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.

ఫోరం అధ్యక్షుడు గంగిరెడ్డి ఆధ్వర్యంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రాగిరి ఆనంద్ బాబు గౌడ్, కూకట్‌పల్లి చైర్మన్ పుష్పరెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

తాము ప్రస్తావించిన అంశాలపై త్వరలోనే రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కతో సమన్వయం చేసి అవసరమైన నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటానని మంత్రి తుమ్మల హామీ ఇచ్చినట్లు చైర్మన్ ఆనంద్ బాబు తెలిపారు. అలాగే భట్టి విక్రమార్కను ప్రత్యక్షంగా కలిసి వివరాలు తెలియజేయాలని మంత్రి సూచించడంతో, త్వరలోనే ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కను కలిసి సమస్యలను వివరించనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్లలో ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కార దిశగా కదులుతాయన్న నమ్మకాన్ని ఆనంద్ బాబు వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి Cantonment బోర్డు CEOతో ఎమ్మెల్యే శ్రీగణేష్ భేటీ

https://www.google.com/search?sca_esv=d2fa72479429c903&rlz=1C1OKWM_enIN1097IN1099&sxsrf=AE3TifM_1KIpozQbA6_eSmIl3FHaSmpZpQ:1763391175645&q=farmers+market+committee&tbm=nws&source=lnms&fbs=AIIjpHxU7SXXniUZfeShr2fp4giZjSkgYzz5-5RrRWAIniWd7tzPwkE1KJWcRvaH01D-XIWeastqiZIJdfgxUh0jAqXh0guv7UNXeXDK8EgbrT4CB9Q7SynXWRS0iawm-nnjXpi-qTzzCtFU8fLxeO8pe9YMJOe-JyWvz2SEzStBzjZ2tg9TsFv_nBdmGs4iUgF-Bh1SzMgM4ycCqWxoMInY8V_L0TULKQ&sa=X&ved=2ahUKEwjniv-EuPmQAxUWc_UHHZF2AsEQ0pQJegQIFxAB&biw=1366&bih=625&dpr=1

Leave a Reply