HYD | ప్రజలపై హనుమంతుని ఆశీస్సులు.. – ఎమ్మెల్యే గణేష్

తాడుబందు హనుమాన్ దేవాలయంలో అన్నకూట మహోత్సవం, దివ్య జ్యోతి సందర్శన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని ద‌ర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ, ఆంజ‌నేయ స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అభివృద్ధి మార్గంలో ముందుకెళ్లాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎమ్మెల్యేను ఆలయ మర్యాదలతో సత్కరించగా, వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించారు.

Leave a Reply