HYD | అఖిల్-జైనబ్ రిసెప్షన్‌.. హాజ‌రైన సీఎం రేవంత్ !

అక్కినేని అఖిల్, జైనబ్ రవ్‌జీ నిన్న వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహం అనంతరం ఈరోజు (జూన్ 8న) అన్నపూర్ణ స్టూడియోలో రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించారు.

ఈ రిసెప్షన్‌లో సినీ, రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రిసెప్షన్‌కు హాజరై అఖిల్, జైనబ్ దంపతులను ఆశీర్వదించారు.

సినీ రంగం నుండి మహేష్ బాబు, నాని, సాయి ధరమ్ తేజ్, నాగ చైతన్య, సురేష్ బాబు, లక్ష్మీ మంచు, తదితరులు హాజరై వేడుకకు మరింత రంగు నింపారు. నాగార్జున, అమల వ్యక్తిగతంగా రాజకీయ నాయకులను ఆహ్వానించడం కూడా విశేషంగా నిలిచింది.

Leave a Reply