HYD | నాంపల్లి అగ్నిప్రమాదం.. భవన యజమాని అరెస్ట్

HYD | నాంపల్లి అగ్నిప్రమాదం.. భవన యజమాని అరెస్ట్

HYD | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : నగరంలోని నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో భవనం యజమాని సతీశ్‌ను అబిడ్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. వ్యాపారులు ఫర్నిచర్, కెమికల్స్ తో సెల్లార్ ను నింపేశారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ ఒకటే ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Leave a Reply