HYD | ఎందుకంటే….

HYD | ఎందుకంటే….
HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్కాపురానికి చెందిన సీతారాం (36) హైదరాబాద్ లోని హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నంద్యాలకు చెందిన యువతితో సీతారాంకు వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. కొంతకాలంగా హైదరాబాద్ బాచుపల్లిలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. జనవరి 24న భర్త వద్దే పిల్లలను వదిలి భార్య వెళ్లి పోవడంతో సీతారాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతని వద్దే ఉంటున్న అత్తామామలు పిల్లలను తీసుకుని నంద్యాల వెళ్లిపోయారు. దాంతో మనస్తాపానికి గురైన సీతారాం తన బైక్‌పై బయల్దేరి ట్యాంక్‌బండ్ చేరుకున్నారు.
