HYD | శీతాకాలం విడిదికి రాష్ట్రపతి

HYD | శీతాకాలం విడిదికి రాష్ట్రపతి
HYD | హైదరాబాద్, ఆంధ్రప్రభ : శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ (Hyderabad) చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి విమానం దిగిన వెంటనే తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, పలువురు మంత్రులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బొల్లారం రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఈ విడిది సందర్భంగా ఆమె రాష్ట్రంలోని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. గతంలో రాష్ట్రపతులు శీతాకాలంలో హైదరాబాద్‌లో విడిది చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి కూడా ఆ సంప్రదాయాన్ని ఆమె కొనసాగిస్తున్నారు. ఈనెల 21 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉండనున్నారు.
