Huzurnagar | మాజీ సర్పంచ్ల అరెస్ట్
Huzurnagar | హుజూర్నగర్, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ చలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న హుజూర్నగర్ మండల పరిధిలోని మాజీ సర్పంచ్లను సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత మాజీ సర్పంచులు అద్దంకి సైదేశ్వర్రావు, కీత జయమ్మ ధనమూర్తి, షేక్ అలీ, గుజ్జుల సుజాత అంజిరెడ్డి ఉన్నారు.

