భార్యాభర్తలకు తీవ్ర గాయాలు

భార్యాభర్తలకు తీవ్ర గాయాలు

నవాబ్ పేట్, (ఆంధ్ర‌ప్ర‌భ): కారు, ద్విచక్ర వాహనం ఢీకొని భార్యాభర్తలకు తీవ్ర గాయాలైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఈ రో్జు మీనేపల్లికలాన్ గ్రామానికి చెందిన చాకలి శ్రీనివాస్ (28) (Chakali Srinivas), కావేరి (25) దంప‌తులు ఉద్యోగ నిమిత్తం వెళ్తుండగా మార్గ‌మ‌ధ్య‌లో నవాబ్ పేట్ వ‌ద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ఘ‌ట‌న‌లో బైకుపై ప్రయాణిస్తున్న దంప‌తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

గాయపడిన ఇద్దరిని అంబులెన్స్ లో సంగారెడ్డి (Sangareddy) లోని ఓ ఆసుపత్రికి చికిత్స కోసం గ్రామస్తులు తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ప్రమాదంపై దర్యాప్తు నిర్వహిస్తున్నారు. కారు కిలోమీటర్ దూరంలో వదిలేసి కారు యజమాని పారిపోయి పోలీస్ స్టేషను ఆశ్రహించారు. ఇప్పటి వరకు ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని నవాబ్ పేట్ ఎస్సై జీ.పుండ్లిక్ తెలిపారు.

Leave a Reply