Hunt Starts |ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లు కూల్చివేత

శ్రీనగర్: పెహల్‌గామ్‌ నరమేధంపై ఇండియన్‌ ఆర్మీ ప్రతీకార చర్యలకు దిగింది. ఉగ్రదాడిలో హస్తం ఉందని భావిస్తున్న ఇద్దరు టెర్రరిస్టుల ఇళ్లను ధ్వంసం చేసింది. పెహల్‌గామ్‌లో నరమేధం సృష్టించి 26 మందిని బలిగొన్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్‌ హుస్సేన్‌ థోకర్‌, ఆషిఫ్‌ షేక్‌ఇళ్లను సైన్యం ఐఈడీతో పేల్చేసినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొంటున్నాయి. పెహల్‌గామ్‌ మారణహోమంలో జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాకు చెందిన థోకర్‌ కీలక నిందితులలో ఒకరుకాగా, ఆషిఫ్‌ షేక్‌ ఈ దాడి కుట్రలో పాల్గొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు

Leave a Reply