తిరుపతి కోసం వేట
- చంద్రన్న కోసం జల్లెడ
- హిడ్మా కోసం హంట్
- భూపతి పైనే భద్రతదళాలు ఆధారం
ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : కగార్ ఆపరేషన్(Operation Kagar)తో దండకారణ్యంలోని ఉత్తర బస్తర్‌లో జనతానా రాజ్యం అంతరించింది. ఇక దక్షిణ బస్తర్ ను కైవశం చేసుకోవటమే.. కేంద్రం లక్ష్యం. ఇప్పటికే రచించిన వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లాసంగా.. ఉత్సాహంగా తన బలగాలతో ఉరుకులు పరుగులు పెడ్తోంది. దక్షిణ బస్తర్ ను స్వాధీనం చేసుకోవటం మహా ఈజీ అని పోలీసు ఉన్నతాధికారులు విజయోత్సాహంతో కదం తొక్కుతున్నారు. ఎందుకంటే.. మిగిలిన మావోయిస్టు(Maoist) నేతల ఆచూకీ కనిపెట్టటం అంత కష్టం కాదని దండకారణ్యంలోని గిరిజనం అభిప్రాయం.
మావోయిస్టు పార్టీ భూపతి, ఆశన్న తమ బలగాలతో లొంగిపోవటం.. అంతక ముందు జరిగిన ఎన్ కౌంటర్ల కథల నేపథ్యంలో.. నక్సలైట్ల వేటలో తలమునకలైన భద్రతాదళాలకు ముగ్గురు పీపుల్స్ లిబరేషన్ గెరిల్ల ఆర్మీ దళపతులే టార్గెట్. వీరిని పట్టించటమే భూపతి, రూపేష్(Bhupathi, Rupesh) ఎదుటి ప్రధాన టాప్క్. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? ఎక్కడ ఉన్నారు? దండకారణ్యంలో ప్రతిదాడికి ఎదురు చూస్తున్నారా? లేక వెన్నుచూపి రహస్య ప్రాంతంలో దాక్కున్నారా? వీరి సమాచారం ఎవరి దగ్గర ఉంది? ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్ గడ్, మహారాష్ట్రాల్లో తారా స్థాయిలో చర్చ జరుగుతోంది.
ఔను కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణరావు, చంద్రన్న, సెంట్రల్ మిలిషియా కమిషన్ సభ్యులు తి ప్పరి తిరుపతి(Tippari Tirupati), సెంట్రల్ మాడ్వి హిడ్మా ఆచూకీ కోసం కేంద్ర నిఘా సంస్థలు నిద్ర పోవటం లేదు. ఈ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేయటమే లక్ష్యంగా కేంద్రం పావులు కదుపుతోంది. ఇప్పటికే కగార్ ఆపరేషన్‌లో 1,040 మంది మావోయిస్టు కేడర్ లొంగిపోయారు. జనవరి 2024 నుంచి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2,100 మంది లొంగిపోయారు.
1,785 మందిని పోలీసులు అరెస్టు అయ్యారు. 477 మంది ఎన్ కౌంటర్లలో చనిపోయారు. ఇక ఇటీవల మల్లోజుల వేణుగోపాలరావు సహా 61 మంది, కేంద్ర కమిటీ సభ్యుడు వాసుదేవరావు అలియాస్ ఆశన్న(Vasudevarao alias Ashanna), మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత ఆధ్వర్యంలో 208 మంది లొంగిపోయారు. ఈ స్థితిలో ఉత్తర బస్తర్ మావోయిస్టు రహిత జిల్లాగా కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇక లొంగుబాట్ల పర్వ ముగుస్తోంది. లొంగిపోవాలని ఆలోచన వస్తే తనకు ఫోన్ చేయలని వాసుదేవరావు బహిరంగ ప్రకటన చేశారు. అంటే.. త్వరలోనే కీలక నేతల హంట్ ప్రారంభం కాబోతోందని ఆశన్న హెచ్చరించారని తెలుస్తోంది.
ఇంతకీ కేంద్ర ప్రభుత్వం వేటలో.. టార్గెట్ ఎవరు? పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులే లక్ష్యం. కానీ ఇప్పుడు ఈ విభాగాల్లో ఎందరు మిగిలారు? ఎవరికి ఈ చావు హెచ్చరిక ఒక సారి పరిశీలిద్దాం. భారతదేశంలో నిషేధిత మావోయిస్టు పార్టీలో రెండు అత్యున్నత స్థాయిల్లో నేతలు ఉన్నారు. ఒకటి పొలిట్ బ్యూరో(Polit Bureau), ఇది అత్యున్నత నిర్ణయాధికార సంఘం, ఇందులో 12. నుంచి -16 మంది సభ్యులు ఉంటారు. రెండవది సెంట్రల్ కమిటీ. ఇది ప్రధాన నిర్ణయాధికార సంఘం, ఇందులో 30-..45 మంది సభ్యులు ఉంటారు. ఈ కగార్ ఆపరేషన్ లో ఇప్పటికి 30 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు, 8 మంది పొలిట్ బ్యూరో సభ్యులు చనిపోయారు.
2004లో 16 మంది పొలిట్ బ్యూరో సభ్యులు ఉంటే.. ప్రస్తుతం నలుగురే క్రియాశీలంగా ఉన్నారు. ముప్పల్లా లక్ష్మణ రావు(Muppala Lakshmana Rao) అలియాస్ గణపతి, మిసిర్ బేస్రా, తిప్పర్తి తిరుపతి అలియాస్ దేవ్జీ, చంద్రన్న ఉన్నారు. చెరుకూరి రాజ్‌కుమార్ (అజద్), మల్లాజుల కొటేశ్వర్ రావు (కిషెంజీ), కటకం సుదర్శన్ (ఆనంద్) నంబల కేశవ రావు (బసవరాజు, వివేక్ చంద్రి యాదవ్ (ప్రయాగ్) ఝార్ఖండ్)ఈ ఎనమిది మంది వివిధ ఎన్ కౌంటర్లలో మృతి చెందారు.
– 2004లో 34.. -45 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉంటే ..2010లో 22 మంది చనిపోయారు. బసవరాజు, చలపతి, ప్రయాగ్, సుధాకర్, గజర్ల రవి, మోడెం బాలకృష్ణ(Modem Balakrishna), కట్టా రామచంద్ర రెడ్డి, కదరి సత్యనారాయణ రెడ్డి, సహా తొమ్మిది మంది హతమయ్యారు. 15 స్టేట్ కమిటీ సభ్యులు మరణించారు. ప్రస్తుతం ఏడుగురు కేంద్రకమిటీ సభ్యులు మాత్రమే యాక్తివ్ గా ఉన్నారు. వీరిలో ఇద్దరు ఝార్ఖండ్ మావోయిస్టులు కాగ, మిగిలిన ఐదుగురు ఏపీ, తెలంగాణకు చెందిన నేతలే.
ఆ ఇద్దరే టార్గెట్
ప్రస్తుతం ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు టార్గెట్ . ఒకరు తిప్పర్తి తిరుపతి, మకొకరు చంద్రన్న. వీరిద్దరూ మల్లోజుల భూపతికి ప్రధాన శత్రువులు. వీరిని తుదముట్టించటమే భూపతి, ఆశన్న లక్ష్యం. సెంట్రల్ కమిటీ(Central Committee) భేటీల్లో మల్లోజుల వేణుగోపాలరావును, వాసుదేవరావునును వీరిద్దరూ వ్యతిరేకించారు. దీనికి తోడు బసవరాజు, సుధాకర్ ఎన్ కౌంటర్లతో పార్టీలో సోనూను, ఆశన్నను తిరపతి , చంద్రన్న అనుమానాలు పెరిగాయి. పార్టీలోనూ వీరిద్దరూ కోవర్టులు అనే భావన పెరిగింది.
వేణుగోపాలరావు సతీమణి లొంగు బాటు తరువాత .. గత జనవరి నుంచే పార్టీలో అంతర్గత మధనం జరుగుతోంది. దీనికి తోడు వేణుగోపాలరావు వ్యవహార శైలిలోనూ మార్పు కనిపించింది. దీనికి తోడు బసవరాజు మరణం తరువాత పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను తిరుపతికి అప్పగిస్తారానే ప్రచారం తెరమీదకు వచ్చింది. జాతీయ మీడియా ఇప్పటికే మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిరుపతిని ప్రకటించింది. తిప్పిరి తిరుపతి (అలియాస్ దేవుజీ, సంజీవ్) మావోయిస్టు పార్టీ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా – మావోయిస్టు)లో అత్యున్నత నాయకుడు.
ప్రస్తుతం పొలిట్‌బ్యూరో సభ్యుడే కాదు. సెంట్రల్ మిలిషియా కమిషన్ చీఫ్(Chief of Central Malaysia Commission) కూడా. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం అంబేడ్కర్ నగర్‌కు చెందిన తిరుపతి దళిత నేత. ప్రస్తుతం దండకారణ్య అడవుల్లో దక్షిణ బస్తర్ ప్రాంతం నారాయణపూర్, దంతేవాడ ప్రాంతాల్లో ఉన్నాడని భద్రతా బలగాలు అంచనా. అందుకే దక్షిణ బస్తర్ పై తాజాగా భద్రతదళాలు ఫోకస్ పెట్టాయి. ఐతే, ఆయన పూర్తి సమాచారం లభించలేదు. ఇక చంద్రన్న(Chandranna) కూడా దక్షిణ బస్తర్ లోనే ఉన్నట్టు భద్రతదళాల అనుమానం. వీరిద్దరి జాడ మల్లోజుల టీమ్ కే తెలుసని.
త్వరలోనే వీరిద్దరినీ భద్రత దళాలు లేపేస్తాయని ప్రచారం జరుగుతోంది. ఇక అసలు కీలక నేత గణపతి ఆచూకీ అంతుబట్టటం లేదు. ఆయన ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన తరువాత దేశం విడిచి వెళ్లాడని, అంతర్జాతీయ విప్లవ సంస్థలతో కలసి వ్యూహరచనలో నిమగ్నమయ్యారని ప్రచారం జరుగుతోంది.
అందరి దృష్టి హిడ్మా పైనే
మడ్వి హిడ్మా మావోయిస్టు హంటింగ్ స్టార్. ప్రస్తుతం దండాకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ కమాండర్. మావోయిస్టు ఆపరేషన్లకు ప్రధాన ఆర్కిటెక్ట్‌గా పరిగణించబడుతున్నాడు. సుక్మా జిల్లా, పువర్తి గ్రామానికి చెందిన గొండు గిరిజనుడు, 1990ల చివరలో మావోయిస్టు ఉద్యమంలో చేరి, గ్రౌండ్ -లెవల్ ఆర్గనైజర్‌గా ప్రారంభించాడు. 2016లో అతను ఒకసారి అరెస్ట్ అయ్యాడు, కానీ తక్కువ-స్థాయి కార్యకర్తగా విడుదలయ్యాడు.
తర్వాత అతను త్వరగా ఎదిగి, 2019లో రవుల సీనియస్ (రమన్నా) మరణం తర్వాత దండకారణ్యం స్సెషల్ జోన్ ఇన్-చార్జ్‌గా నియమితుడయ్యాడు. 2025లో, జనరల్ సెక్రటరీ బసవరాజు మరణం తర్వాత, సెంట్రల్ కమిటీ మెంబర్‌గా మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నాడు. అతని భార్య రాజే కూడా మావోయిస్టు నాయకురాలే. మావోయిస్టుల హీరో హిడ్మా బస్తర్ గిరిజనులలో లోకల్ హీరో, తెలుగు మావోయిస్టు లీడర్లతో తెలుగు మాట్లాడే ప్రత్యేకత కలిగి ఉన్నాడు.
అతను గెరిల్లా వార్‌ఫేర్ , సెక్యూరిటీ ఫోర్సుపై దాడుల్లో నైపుణ్యం కలిగిన నేతగా ఎదిగాడు. అతని బెటాలియన్‌లో 180 నుంచి -250 మంది ఫైటర్లు ఉన్నారు. హీడ్మా పై సుమారు 26 కేసులు ఉన్నాయి, కొరాపుట్, మల్కం గిరి జిల్లాల్లో భద్రత దళాలపై దాడులు, హత్యలు, ఆయుధాలు, లాజిస్టిక్స్ సరఫరా కేసులు నమోదయ్యాయి, ఏది ఏమైనా.. ఈ ఐదుగురు సెంట్రల్ కమిటీ సభ్యుల్ని ఏరివేస్తే దండకారణ్యం ఖాళీ అవుతుందని భద్రత దళాలు భావిస్తుంటే.. మావోయిస్టు పార్టీ మాత్రం .. భారీ లోటును ఎలా పూడ్చాలి.. ఎవరికి నాయకత్వం ఇవ్వాలనే అంశంపై అంతర్గత మథనంలో పడినట్టు తెలుస్తోంది.