రాజకీయాల్లో హాట్ టాఫీక్ గా నిరాహార దీక్ష..

నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజా నాయకుడు ధర్మపురి సంజయ్ కు కాంగ్రెస్ అధి ష్టానం ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం లేదంటూ ధర్మ పూరి సంజయ్ అభిమా నులు ప్రశ్నిస్తున్నారు. ధర్మ పురి సంజయ్ కు సుము చిత ప్రాధాన్యత కల్పిస్తూ న్యాయం చేయాలని డిమాం డ్ చేస్తూ నిరాహార దీక్షలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిజామాబాద్ లో ధర్మ పురి సంజయ్ అభిమా నులు నిరాహార దీక్ష చేప ట్టడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

శనివా రం నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని గాంధీ చౌక్ లో మాజీ మేయర్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్య క్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ధర్మపురి సం జయ్ కు కాంగ్రెస్ అధి ష్టా నం ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ నిరసిస్తూ గాం ధీచౌక్ లో డి ఎస్ అభిమా నులు నిరాహార దీక్ష చేప ట్టారు. ప్లకార్డు లతో ధర్మ పురి సంజయ్ కు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ధర్మపురి సంజయ్ అభి మానులు మాట్లాడుతూ.. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ ని ధర్మ పురి శ్రీనివాస్ అధికారంలోకి తెచ్చి కాంగ్రె స్ కు పెద్ద దిక్కు గా నిలిచా రని అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి ధర్మపురి శ్రీనివాస్ ఎనలేని సేవలు చేశారని ఈ సందర్భంగా డి ఎస్ అభి మానులు తెలిపారు. బల్ది యా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠం కైవసం చేసు కునేలా ధర్మ పురి సంజయ్ ప్రత్యేక కృషి చేశారని ధర్మ పురి సంజయ్ అభిమా నులు తెలిపారు.

ధర్మపురి శ్రీనివాస్ వారసుడికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అన్యా యం చేస్తున్నారని డిఎస్ అభిమానులు వాపో యారు.జిల్లా పర్యటనలో భాగంగా వచ్చిన తెలంగాణ రా ష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి డి ఎస్ సమాధి ముందు ధర్మ పురి సంజయ్ కు ఇచ్చిన మాటను మరి చారని డిఎస్ అభిమానులు తెలిపారు. ధర్మపురి సంజ య్ కు ప్రాధాన్యం కల్పిం చేంతవరకు మా పోరాటం ఆగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply