Humanity | మానవతా దృక్పథంతో స్పందించిన గద్దె క్రాంతి కుమార్

Humanity | మానవతా దృక్పథంతో స్పందించిన గద్దె క్రాంతి కుమార్

అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న కలపాల దాసుకు ఆక్సీజన్ మిషన్ ఏర్పాటు..

Humanity | పటమట, ఆంధ్రప్రభః విజయవాడ లోని 7వ డివిజన్‌కు చెందిన కలపాల దాసు అనారోగ్య కారణంగా శ్వాసకోశ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ వెంటనే స్పందించారు. ఆక్సీజన్ అందక ఇబ్బంది పడుతున్న దాసు నివాసానికి బుధవారం ఉదయం స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. దాసు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తక్షణ అవసరంగా ఒక ఆక్సీజన్ మిషన్‌ను ఏర్పాటు చేసి అందజేశారు. అదేవిధంగా వైద్య సహాయం నిరంతరం అందేలా అవసరమైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.194 కోట్ల వ్యయంతో 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో 1144 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమర్థవంతంగా సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం కాపాడటం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, అవసరమైన ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తామని గద్దె క్రాంతి కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సతీష్ చంద్ర, దయాల శిరీష గాంధీ, దోమకొండ జ్యోతి, పరసా లక్ష్మణ్, పఠాన్ హయత్ ఖాన్, కోట శివలక్ష్మి, జగరపు బాలు, సన్నీ, రవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply