సైన్స్ తోనే మానవ జీవితం..

శావల్యాపురం, ఆంధ్రప్రభ : సైన్స్ తోనే మానవ జీవితం ముడిపడి ఉందని వినుకొండ సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్ సాయి ప్రేమ్ అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రమైన శావల్యాపురం శ్రీరామ పాఠశాలలో శుక్రవారం రోజున విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డాక్టర్ సాయి ప్రేమ్, డాక్టర్ అనూష, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వలేటి శివకృష్ణ పాల్గొని వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు.

ఈ ప్రదర్శనలో విద్యార్థులు గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ పరిరక్షణ, మానవ అవయవాల పని, ఆహారం, ఆరోగ్యం తదితర అంశాలపై నమూనాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయి ప్రేమ్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే ఆధునిక విజ్ఞానశాస్త్రంపై మొగ్గుచూపి శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. అనంతరం మంచి ప్రయోగాలతో ఆకట్టుకున్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కె.వి.ఆర్ మోహన్ చంద్, ప్రిన్సిపాల్ రత్నకుమారి, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply