తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి : తిరుమల వెంకటేశ్వర స్వామివారి పట్ల భక్తులు తమ భక్తిని విరాళాల రూపంలో వ్యక్తం చేస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానాల(టీటీడీ)కి దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా విరాళాలు నిరంతరం అందుతుంటాయి. ఈ క్రమంలో తాజాగా టీటీడీ మరోసారి విశేషమైన విరాళం సమర్పించారు.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా వెలివెన్నుకు చెందిన శశి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ మేనేజింగ్ పార్ట్నర్ రవికుమార్ బురుగుపల్లి భారీ విరాళాన్ని సమర్పించారు.
సంస్థ తరఫున ఆయన శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.01 కోట్లు (రూ.1,01,11,111) విరాళంగా అందజేశారు. ఈ విరాళం డిమాండ్ డ్రాఫ్ట్‌ను తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీఆర్.నాయుడుకు అందజేశారు.