కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…

వెల్దండ, ఆంధ్రప్రభ : కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీకి జోరు కొనసాగుతోంది. మండలంలోని చొక్కానపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) పార్టీ యువ నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వెల్దండ మాజీ సర్పంచ్ ఎన్నం భూపతి రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం ఈ చేరికలు జరిగినట్లు నేతలు తెలిపారు.

చొక్కానపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు ఈదులపల్లి శ్రీనివాసులు, దూల రామస్వామి, ఈదులపల్లి వెంకటేష్, ఈదులపల్లి లక్ష్మయ్య తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కల్వకుర్తి ఎమ్మెల్యే కశి రెడ్డి నారాయణ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆకట్టుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పుల్లయ్య, ఎర్ర శ్రీను, సాయిరెడ్డి, సుమంత్ రెడ్డి, కృష ముదిరాజ్, పందెపు రమేష్ రెడ్డి, దుల్లా శేఖర్, దుల్లా జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply