HRC | ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

HRC | ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

  • హెచ్ఆర్సీ కార్యాలయ ప్రాంగణంలో

HRC | కర్నూలు, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) కార్యాలయ ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని సెక్షన్ ఆఫీసర్ జి. సునీత ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు వందనం గావించి, జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా సెక్షన్ ఆఫీసర్ జి. సునీత గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. భారత రాజ్యాంగం దేశ పౌరుల హక్కులు,బాధ్యతలు, మరియు కర్తవ్యాలను, పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, రాజ్యాంగంలో పొందుపరిచిన మానవ హక్కుల అమలు ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.

అలాగే మానవ హక్కుల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. బాధితులకు న్యాయం అందించడంలో కమిషన్ నిరంతరం కృషి చేస్తోందని, ప్రజల హక్కుల రక్షణకు అధికారులు అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో హెచ్ఆర్సీ కార్యాలయ విభాగ అధికారి బొగ్గరం తారక నరసింహా కుమార్, నాన్ గెజిటెడ్ అధికారులు యన్. సురేష్ బాబు, యన్. శ్రీనివాసుల రెడ్డి, రఫీ, మరియు సంస్థ సిబ్బంది, హెచ్.ఆర్.సి పోలీస్ లైసెన్ ఆఫీసర్ యన్. ఏ.ఎస్. ఐ యం. రామ్ మోహన్ రెడ్డి, కమీషన్ ఇన్వెస్టిగేషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply