చలి ఎన్ని రోజులు ఉంటుందంటే..

చలి ఎన్ని రోజులు ఉంటుందంటే..

తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమక్రమంగా విజృంభిస్తోంది. గత నాలుగు రోజులుగా చలి గాలులు వీస్తున్నాయి. నవంబర్ 11 నుంచి 19 వరకు చలి తీవ్రత ఎక్కువుగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలియచేశారు. శనివారం నుంచే మొదలైన చలి రోజురోజుకూ పెరుగుతుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. రాబోయే రోజుల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండొచ్చని అంచనా వేశారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలోని బేల, రంగారెడ్డి జిల్లా సాబాద్ లో 14.7 కనీష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలను హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో కనీష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే కూడా తక్కువకు పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ చలి గాలులు నుంచి తమని తాము కాపాడుకోవాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. చలి నుంచి రక్షణ కోసం స్వెట్టర్లు, జాకెట్లు, మఫ్లర్ లు వంటి వెచ్చని దుస్తులు ధరించాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. అలాగే వేడి సూప్ లు, గోరువెచ్చని నీళ్లు ఎక్కువ త్రాగి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని తెలియచేశారు.

Leave a Reply