ఇంటిలోని పూజా మందిరంలో మూడు అంగుళాల వరకు ప్రమాణమైన విగ్రహాలను మాత్రమే నిలుపుకోవాలి. మూడు అంగుళాలు ఉన్న విగ్రహానికి ఒక కిలో ప్రసాదం నివేదన తప్పక చేయాలి. విగ్రహ ప్రమాణానుసారం నివేదన పెరుగుతుంది. విగ్రహ ప్రమాణాలను బట్టి ఆరాధన చేయాలి. అభిషేకాలు, అర్చనలు, నివేదన వాటిలో భేదాలు విగ్రహ ప్రమాణాలను బట్టి ఉంటాయి.
ఎక్కువ నియమ నిష్ఠలు మనం ఆచరించలేము కావున వీలున్నంత తక్కువ ప్రమాణం గల విగ్రహాలను పూజా మందిరంలో నిలుపుకోవాలి. విగ్రహ ప్రమాణం పెరిగితే ప్రాణ ప్రతిష్ట, ఆవాహనాదులు చేయాలి. బంగారం, వెండి, ఇత్తడి, రాగి, కంచు, పంచలోహం, చెక్క వంటి వాటితో విగ్రహాలను చేసుకుని ఆరాదించాలి.
పూజా మందిరంలో ఎంత ఎత్తువరకు విగ్రహాలను ఉంచుకోవచ్చు?
