అసలు ఎలా జరిగింది..?
భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ : అశ్వారావు పేట మండల కేంద్రం దమ్మపేటలో ఈ రోజు కారు దగ్దమైన సంఘటన చోటు చేసుకుంది. దమ్మపేటకు చెందిన నల్లపోతుల నాగరాజు(Nagaraja of Nallapotula) ఉదయం బయటకు వెళ్లి వచ్చిన తర్వాత ఇంటి బయట కారు పార్క్ చేసారు. అయితే.. ఇంట్లోకి వెళ్లేసరికి పార్క్ చేసిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అయితే ఈ ఘటన షార్ట్ సర్క్యూట్(short circuit)గా భావిస్తున్నారు. అశ్వారావుపేట నుండి అగ్ని మాపక యంత్రం ప్రమాద స్థలానికి రావటానికి ఇరుకు మార్గం కావటం వల్ల చేరుకోలేకపోయింది. చుట్టు పక్కల వాళ్ళు చూసినప్పటికీ కారు నుండి శబ్దాలు రావటంతో ఎవరూ అక్కడికి వెళ్ళటానికి సాహసించలేదు. దీంతో కారు పూర్తిగా దగ్దమయ్యింది. సంఘటనా స్థలాన్ని దమ్మపేట పోలీసులు చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.

