Housing PD | ఇండ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలి

Housing PD | ఇండ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలి
- హౌజింగ్ పీడీ కే.రాజేశ్వర్
Housing PD | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండలంలోని లక్ష్మణ్ చాంద, కంజర్ గ్రామపంచాయతీలలో హౌజింగ్ పీడీ కే.రాజేశ్వర్ శనివారం పర్యటించారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలని, ఇంటి స్లాబ్ ఏరియా 800 స్క్వేర్ ఫీట్‌కు మించరాదని, 600 స్క్వేర్ ఫీట్ దాటరాదని సూచించారు. అనంతరం మండల పంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల గురించి సమావేశం నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తిస్తూ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణాలు జరిగేలా చూడాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాధ, ఎంపీవో నసీరుద్దీన్, లక్ష్మణ చాంద సర్పంచ్ ఓస కవిత రాజు, కంజర్ సర్పంచ్ మోహన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
