ఉట్నూర్, మార్చి 5 (ఆంధ్రప్రభ) : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఘన్పూర్ పంచాయతీలో గల చింతగూడ గ్రామంలో ఇవాళ తెల్లవారుజామున ప్రమాదవశాత్తు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది.
పంద్ర గంగాధర్ అనే ఆదివాసి రైతు ఇల్లు పూర్తిగా దగ్ధమైందని, బాధితుడు గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జరిగిన అగ్నిప్రమాదం వల్ల ఇంట్లో నిల్వ ఉంచిన ఏడు క్వింటాళ్ల పత్తితో పాటు ఇంట్లో ఉన్న అరవై వేల నగదు, సామాగ్రి వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయని బాధితుడు తెలిపినట్లు ఉట్నూర్ మాజీ ఎంపీపీ పంద్ర జైవంత్ రావు, ఘన్పూర్ పంచాయతీ మాజీ సర్పంచ్ పంద్రాలత తెలిపారు. వారు జరిగిన సంఘటన వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా అగ్ని ప్రమాదం వల్ల నష్టపోయిన రైతు గంగాధర్ కు ఆదుకోవాలని వారు కోరారు.