Hospital | ఘోర రోడ్డు ప్రమాదం..

Hospital | ఘోర రోడ్డు ప్రమాదం..
Hospital | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.డోన్ జాతీయ రహదారిపై ఓబులాపురం మెట్ట వద్ద బుధవారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సొంత కారులో కన్యాకుమారి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి సైడ్ కు ఏర్పాటుచేసిన సేఫ్ గార్డును గుద్దేసింది.కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు అక్కడికి వచ్చి కారులో ఉన్న వారిని బయటకు తీశారు. కారులో శ్రీధర్ సుభాష్ తో పాటు మరో ఇద్దరు ఉన్నారు.
వారిలో శ్రీధర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికుల సమాచారంతో పోలీసులు డోన్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన వారిని మొత్తం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. బంధువులకు సమాచారం అందించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు దృవీకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


click here to read more : Toll Plaza | పెద్దిరెడ్డి పీఏ, ప్రధాన అనుచరుడు అరెస్టు
