మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లకు సన్మానం

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రితీష్ నివాసంలో మంగళవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ సుమన్ బాయి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఖానాపూర్ మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా ఎన్నికైన అంకం మౌనిక మహేందర్, అలాగే కౌన్సిలర్లుగా ఎన్నికైన సత్యవతి, గుమ్ముల ఆనంద్ దంపతులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ సుమన్ బాయి మాట్లాడుతూ, ఖానాపూర్ పట్టణ ప్రజలకు మంచి సేవలు అందించి ప్రజల్లో మరింత గుర్తింపు పొందాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉట్నూర్ బీజేపీ మండల అధ్యక్షుడు బింగి వెంకటేష్, బీజేపీ నిర్మల్ జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, నాయకులు కల్వ రవి, రాథోడ్ శేషారావు, సీపతి లింగ గౌడ్, సాడిగే రాజేశ్వర్, శ్రీనివాస్, ఉగ్గే విజయ్, అర్జున్ సింగ్, గాలి శ్రీకాంత్, పొన్నం జగన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply