కౌన్సిలర్లకు సన్మానం…

మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపాలిటీకి జరిగినఎన్నికల్లో 5,8 వ వార్డుల నుండి కౌన్సిలర్ లుగా ఎన్నికైన మొగుళ్ళ అనురాధ శ్రీనివాస్ రెడ్డి, పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి లను రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని, పేద ప్రజలకు నిత్యం అండగా ఉండి మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు లింగాల జైపాల్ రెడ్డి డాక్టర్ లక్ష్మీ నరసింహ రెడ్డి, పైల్ల సోమిరెడ్డి, కొంతం నాగార్జున రెడ్డి, ముప్పా వెంకటరెడ్డి ,సోలిపురం చంద్రారెడ్డి, అర్ద ప్రతాప్ రెడ్డి, బద్దం నాగార్జున్ రెడ్డి,పసునూరి చంద్రా రెడ్డి,గంట వేమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
