Honored | క్రికెట్ సేవలకు గుర్తింపు

Honored | క్రికెట్ సేవలకు గుర్తింపు
- పుణేలోని అజీంక్య డీవై పాటిల్ యూనివర్సిటీ నుంచి సత్కారం
Honored | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ క్రికెట్ రంగానికి ఆయన అందించిన విశేష సేవలు, అద్భుతమైన నాయకత్వ పటిమకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ హోదా లభించింది. అజింక్యా డీవై పాటిల్ యూనివర్సిటీ రోహిత్ శర్మను డాక్టరేట్‌తో సత్కరించింది. పుణేలోని అజీంక్య డీవై పాటిల్ యూనివర్సిటీ (ADYPU) గౌరవ డాక్టరేట్ (డాక్టర్ ఆఫ్ లెటర్స్ – D.Litt.) ప్రదానం చేయనుంది.
శనివారం జరగనున్న యూనివర్సిటీ 10వ స్నాతకోత్సవంలో రోహిత్ శర్మ ఈ గౌరవాన్ని అందుకోనున్నాడు. వర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ అజీంక్య డీవై పాటిల్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. క్రీడా రంగంలో రోహిత్ సాధించిన విజయాలు, ప్రపంచ వేదికపై ఆయన కనబరిచిన నాయకత్వ లక్షణాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.
